రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ‌న‌జీవి రామ‌య్య‌

Padmasri Vanajeevi Ramaiah met with accident in Khammam.ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రకృతి

By తోట‌ వంశీ కుమార్‌
Published on : 18 May 2022 9:52 AM IST

రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వ‌న‌జీవి రామ‌య్య‌

ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం తెల్ల‌వారుజామున మొక్కల‌కు నీళ్లు పోసేందుకు బైక్‌ పై వెలుతూ రోడ్డు దాటుతుండగా మరో ద్వి చక్రవాహనం ఆయ‌న్ను ఢీ కొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఆయ‌న గాయ‌ప‌డ్డారు. స్పందించిన స్థానికులు వెంట‌నే ఆయ‌న్ను ఖ‌మ్మం ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం రామ‌య్య‌కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

మొక్కల పెంపకంపై రామయ్య ప్రజల్లో అవగాహన కల్పించ‌డంతో పాటు వేల సంఖ్య‌ల్లో మొక్క‌ల‌ను నాటి వాటిని ప‌రిర‌క్షించారు. దీంతో ఆయనను వనజీవి రామయ్యగా పిలుస్తుంటారు. మొక్కల పెంపకం కోసం రామయ్య చేస్తున్న కృషికి గాను రామయ్యను పద్మశ్రీ అవార్డు వ‌రించింది.

Next Story