బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై టోల్ ఛార్జీలు పెంపు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు.

By Knakam Karthik
Published on : 31 March 2025 12:52 PM IST

Hyderabad News, ORR, Toll Charges Hike

బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్ ఓఆర్ఆర్‌పై టోల్ ఛార్జీలు పెంపు

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై టోల్ ఛార్జీలను పెంచారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఔటర్ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఐఆర్‌బీ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ సంస్థ ప్రకటించింది. రేపటి నుంచి పెరిగిన ఓఆర్ఆర్ టోల్ ఛార్జీలు అమలులోకి రానున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్​(హెచ్‌జీసీఎల్) నిర్వహణలో ఉండే ఓఆర్‌ఆర్‌ను బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఐఆర్‌బీ సంస్థ గత సంవత్సరం 30 ఏళ్లకు లీజుకు తీసుకున్న విషయం తెలిసిందే.

ఒప్పందం ప్రకారం, ప్రతి సంవత్సరం టోల్ ఛార్జీలను పెంచుకునే వెసులుబాటును కూడా ఆ సంస్థకు కల్పించింది. దీంతో హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై టోల్‌ ఛార్జీలను పెంచుతున్నట్లుగా ఆ సంస్థ ప్రకటించింది. కారు, జీపు, లైట్‌ మోటర్ వెహికల్స్‌కు కి.మీకు రూ.2.34 నుంచి రూ.2.44కు, ఇక మినీ బస్‌, ఎల్‌సీవీలకు కి.మీకు రూ.3.77 నుంచి రూ.3.94కు పెంచారు. అదేవిధంగా 2 యాక్సిల్‌ బస్సులకు కి.మీకు రూ.6.69 నుంచి రూ.7కు, హెవీ వెహికిల్స్‌కు కి.మీ. రూ.15.09 నుంచి రూ.15.78కి పెంచుతూ ప్రకటన విడుదల చేశారు.

Next Story