OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా

OU, KU Postponed exams with heavy rains. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది.

By అంజి  Published on  11 July 2022 3:40 AM GMT
OU, KU పరిధిలో పలు పరీక్షలు వాయిదా

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు రాష్ట్ర సర్కార్ మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండటంతో.. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను అధికారులు వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి పి.మల్లారెడ్డి తెలిపారు.

సోమవారం జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 2న నిర్వహించనున్నారు. అలాగే మంగళవారం జరగాల్సిన బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల రెండో, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 3న జరపనున్నారు.

సోమవారం జరగాల్సిన బీసీఏ నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 13వ తేదీన, మంగళవారం జరగాల్సిన బీవో రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 21న, మంగళవారం జరగాల్సిన బీవో రెండో సెమిస్టర్‌ పరీక్ష ఈ నెల 21న, సోమవారం జరగాల్సిన బీవో నాలుగో సెమిస్టర్‌ పరీక్షను ఈ నెల 22న నిర్వహించనున్నట్లు కేయూ అధికారులు తెలిపారు.

ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న అంశాన్ని త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. బీటెక్‌, బీఫార్మాకు సంబంధించిన సెమిస్టర్‌ పరీక్షలను కూడా వాయిదా వేసినట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ తెలిపారు. వాయిదా వేసిన పరీక్షలను 16వ తేదీ తర్వాత న్విహించనున్నట్లు పేర్కొన్నారు.

Next Story