తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
By - Knakam Karthik |
తెలంగాణలో ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టుల మూసివేతకు ఆదేశాలు జారీ చేసింది. తక్షణమే చెక్‌పోస్టుల కార్యకలాపాలు నిలిపివేయాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్‌పోస్టులు మూసివేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు, తొలగించాలని డీటీవోలకు సూచించారు.
వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్క్‌పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. ఈరోజు సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదిక సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు.