మేడారం సమ్మక్క సారక్క బంగారం.. నేరుగా ఇంటికే
Order Medaram sammakka sarakka prasadam online. ఫిబ్రవరి 12 నుండి 22 వరకు సమ్మక్క సారలమ్మ ప్రసాదం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. కాగా ప్రసాదాన్ని
By అంజి Published on 8 Feb 2022 3:32 AM GMTఫిబ్రవరి 12 నుండి 22 వరకు సమ్మక్క సారలమ్మ ప్రసాదం కోసం భక్తులు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. కాగా ప్రసాదాన్ని ఆర్డర్ చేసిన వారి ఇంటి వద్దకే పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేవ కోసం దేవాదాయ శాఖ టీఎస్‌ఆర్టీసీ, పోస్టల్, ఐటీ శాఖల సహకారంతో ఏర్పాట్లు చేస్తోంది. ములుగు జిల్లా మేడారంలో ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు గిరిజనుల ద్వైవార్షిక సమ్మక్క సారలమ్మ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. ప్రసాదాల పంపిణీని టిఎస్‌ఆర్‌టిసి పార్శిల్ సర్వీస్ ద్వారా, పోస్ట్‌ల ద్వారా డోర్ డెలివరీ చేయనున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి ఎ ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. ఈ సేవతో పాటు అమ్మవారికి 'బెల్లం' సమర్పించాలనుకునే భక్తుల సౌకర్యార్థం టిఎస్‌ఆర్‌టిసి బెల్లం తీసుకుని మేడారంలో నైవేద్యంగా సమర్పించి తిరిగి భక్తులకు అందజేస్తుందని తెలిపారు.
భక్తులు మీ సేవా కేంద్రాలలో ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడం ద్వారా లేదా టీఏపీపీ ఫోలియో (ప్లేస్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు) ద్వారా ప్రసాదాన్ని పొందవచ్చు. పోస్టుల ద్వారా ప్రసాదం పంపిణీ చేయాలనుకునే భక్తులు ఒక్కో ప్యాకెట్‌కు రూ.225 చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్యాకెట్‌లో 200 గ్రాముల బెల్లం, పసుపు, పచ్చిమిర్చి, అమ్మవారి ఫోటో ఉంటాయి.
టీఎస్‌ఆర్టీసీ ద్వారా ప్రసాదం డెలివరీ కోసం, భక్తులు సమీపంలోని టీఎస్‌ఆర్టీసీ పార్శిల్ బుకింగ్ కేంద్రాన్ని సంప్రదించాలి. భక్తుల చిరునామా నుంచి మేడారం వెళ్లే దూరాన్ని బట్టి టీఎస్‌ఆర్టీసీ సర్వీసుకు ఛార్జీలు వసూలు చేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల నుంచి ఐదు కిలోల వరకు బెల్లం రవాణాను కార్పొరేషన్ చేపడుతుందని టీఎస్‌ఆర్‌టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. వ్యక్తిగతంగా మేడారం సందర్శించలేని భక్తులకు సహాయం చేసేందుకు ఈ సేవ ప్రారంభించబడింది.
దేవాదాయ శాఖ సహకారంతో వినియోగదారుల కోసం ప్రసాదం ప్యాకెట్లను ఏర్పాటు చేస్తారు. భక్తులు ఎక్కడ ప్రసాదం బుక్ చేసుకుంటారో అదే కౌంటర్‌లో వారికి ప్యాకెట్లను అందజేస్తారు. ఈ సేవ కోసం, 200 కి.మీ (అంటే, బుకింగ్ పాయింట్ నుండి మేడారం వరకు) కవర్ చేయడానికి రూ. 400, 200 కి.మీ కంటే ఎక్కువ దూరానికి (మేడారం నుండి బుకింగ్ పాయింట్) రూ. 450 వసూలు చేయబడుతుంది. మేడారం తరలించేందుకు ఫిబ్రవరి 11 నుంచి 17 వరకు బస్ స్టేషన్లలో భక్తుల నుంచి బెల్లం సేకరిస్తారు. అదనపు సమాచారం కోసం, భక్తులు టీఎస్‌ఆర్టీసీ కాల్ సెంటర్ 040-30102829, 040-68153333 ను సంప్రదించవచ్చు. టీఎస్‌ఆర్టీసీ యాప్‌తో మేడారంపై వివరణాత్మక సమాచారం కూడా అందుబాటులో ఉంది. ఇది https://www.tsrtc.telangana.gov.inలో అందుబాటులో ఉంది.