Telangana: మరో రైతు ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో కేసు

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య జరిగింది. జనవరి 19, ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తి.. జనవరి 12 న పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

By అంజి  Published on  19 Jan 2025 4:17 PM IST
Telangana, farmer died, suicide, Adilabad

Telangana: మరో రైతు ఆత్మహత్య.. 24 గంటల్లో రెండో కేసు

తెలంగాణలో మరో రైతు ఆత్మహత్య జరిగింది. జనవరి 19, ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లాలో 40 ఏళ్ల వ్యక్తి.. జనవరి 12 న పురుగుమందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు ఉట్నూర్‌ మండలం లింగోజిగూడ తాండాకు చెందిన రాథోడ్‌ గోకుల్‌గా గుర్తించారు. తొలుత హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చేర్పించిన ఆయన శనివారం రిమ్స్‌-ఆదిలాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు పత్తి రైతు కాగా.. కౌలు భూమిలో పత్తి సాగు చేశాడు. వ్యవసాయం చేయడంలో నష్టం రావడంతో గోకుల్ అప్పు తీసుకుని తిరిగి చెల్లించలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఖచ్చితమైన రుణ మొత్తం తెలియదు.

తెలంగాణలో 24 గంటల్లో ఇది రెండో రైతు ఆత్మహత్య. ఆదిలాబాద్‌లోని ఓ బ్యాంకులో పురుగుమందు తాగి 48 ఏళ్ల రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు బేల మండలం సైదాపూర్‌కు చెందిన రైతు జాదవ్ దేవరావుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రైతు తాను రుణాలు తీసుకున్న బ్యాంకులోకి ప్రవేశించి డబ్బాలో నుండి పురుగుమందు తాగుతున్నట్లు కనిపించింది. ఆదిలాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రైతుకు స్థానిక ఐసీఐసీఐ బ్యాంకు శాఖలో రూ.3.5 లక్షల రుణం ఉంది.

తెలంగాణ రైతు ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం: కేటీఆర్

'ఇది ప్రభుత్వం చేసిన హత్య తప్ప మరొకటి కాదు' అని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. “ఇది ఆత్మహత్య కాదు; ఇది రేవంత్ నేతృత్వంలోని ప్రభుత్వం చేసిన హత్య. తెలంగాణ రైతులు దానిని అలాగే చూస్తున్నారు’’ అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని అన్ని రైతు రుణాలను వెంటనే మాఫీ చేయాలని, ఇకపై తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని సిరిసిల్ల ఎమ్మెల్యే కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కోరారు.

Next Story