అందుకు నిరాకరించిన మరదలు.. అక్క భర్త కత్తితో దాడి

On duty ANM attacked with a knife her brother in law in Rangareddy dist. అక్క భర్త.. ఆమె చెల్లిపై కన్నేశాడు. తనను రెండో వివాహం చేసుకోవాలని కొన్ని రోజులుగా

By అంజి  Published on  8 Dec 2022 4:08 PM IST
అందుకు నిరాకరించిన మరదలు.. అక్క భర్త కత్తితో దాడి

అక్క భర్త.. ఆమె చెల్లిపై కన్నేశాడు. తనను రెండో వివాహం చేసుకోవాలని కొన్ని రోజులుగా వేధింపులకు గురి చేస్తున్నాడు. అయితే పెళ్లికి నిరాకరించిందని మరదలిపై అక్క మొగుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కేశంపేటలో చోటు చేసుకుంది. కత్తి దాడికి గురైన బాధితురాలు అనిత ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎం గా పనిచేస్తోంది. కేశంపేట మండల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ గటన జరిగింది. మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన అనిత రోజూలాగే ఆస్పత్రికి వెళ్లింది.

స్టాఫ్‌ నర్స్‌ కావడంతో ఆ రాత్రి అక్కడే నిద్రించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు ఆస్పత్రిలో ఉన్న అనితపై బావ కిషన్ నాయక్ దాడికి పాల్పడ్డాడు. కత్తితో మరదలిపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే ఆమె చేతి వేళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనిత పై నిర్దాక్షిణ్యంగా విచక్షణారహితంగా పిడి గుద్దులు గుద్దుతూ దాడికి పాల్పడినట్లు సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల్లో కనిపించింది. అనిత గట్టిగా కేకలు పెట్టడంతో అక్కడే నిద్రిస్తున్న ఇతర సిబ్బంది లేచారు. వారిని చూసి కిషన్‌ అక్కడి నుంచి పారిపోయాడు.

అనంతరం అనితను షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనితను పెళ్లి చేసుకోవాలని కొంతకాలంగా కిషన్ నాయక్ వేధిస్తున్నాడు. ఆమె ఎంతకు ససేమీరా ఒప్పుకోకపోవడంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టు కేశంపేట ఎస్సై ధనుంజయ తెలిపారు. ప్రస్తుతం కిషన్ నాయక్ పోలీసుల అదుపులో ఉన్నాడని పేర్కొన్నారు.

Next Story