టీ.. ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది

Old women died after drinking tea.టీ కార‌ణంగా ఒక‌రు చ‌నిపోగా.. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్నారు.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  31 March 2021 4:16 PM IST
die after drinking tea

ఓ కుటంబంలో టీ విషాదాన్ని నింపింది. టీ కార‌ణంగా ఒక‌రు చ‌నిపోగా.. మ‌రో ఇద్ద‌రు ఆస్ప‌త్రిలో చావుబ‌తుకుల మ‌ధ్య పోరాడుతున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. జ‌న‌గామ జిల్లా బ‌చ్చ‌న్న‌పేట మండ‌లంలో దంప‌తులు అంజ‌మ్మ‌, దాసారం మ‌ల్ల‌య్య నివ‌సిస్తున్నారు. రోజు మాదిరిగానే ఈ రోజు ఉద‌యం టీ తాగారు. వీరితో పాటు అంజ‌మ్మ మ‌రిది భిక్ష‌ప‌తి కూడా టీ తాగాడు. అయితే.. అంజ‌మ్మ టీ చేసే స‌మ‌యంలో పొర‌పాటుగా టీ పొడి అనుకుని విష‌గుళిక‌లు(ఎండ్రిన్‌) వేసింది.

దీంతో టీ తాగిన 10 నిమిషాల్లోనే ముగ్గురు అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే వారిని జ‌న‌గామ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ అంజ‌మ్మ ప్రాణాలు కోల్పోయింది. మిగ‌తా ఇద్ద‌రి ప‌రిస్థితి విష‌మంగా ఉంది. దీంతో వారిని వ‌రంగ‌ల్ ఎంజీఎంకు త‌ర‌లించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.


Next Story