వంద రూపాయల నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ : దగ్గుబాటి పురందేశ్వరి
NTR's image on Rs100 coin very soon says Daggubati Purandeswari.ఎన్టీఆర్ బొమ్మను వందరూపాయల నాణెంపై ముద్రించే
By తోట వంశీ కుమార్ Published on
28 May 2022 5:22 AM GMT

ఎన్టీఆర్ బొమ్మను వందరూపాయల నాణెంపై ముద్రించే విషయమై భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ)తో చర్చలు జరుపుతున్నట్లు ఎన్టీఆర్ కుమారై, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలపై స్పందించారు. నేటి నుంచి వచ్చే ఏడాది మే 28 వరకు ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉత్సవాల నిర్వహణ కోసం తెలుగు రాష్ట్రాల్లో 12 కేంద్రాలను గుర్తించినట్లు చెప్పారు. ఆయా కేంద్రాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయన్నారు. ఈ ఉత్సవాల నిర్వహణను పర్యవేక్షించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటు చేశామని, అందులో బాలకృష్ణ, రాఘవేంద్రరావు వంటి ప్రముఖులు కూడా ఉన్నట్టు చెప్పారు. ఈ వేడుకల సందర్భంగా అన్ని రంగాల్లో నిపుణులైన వారిని సత్కరించనున్నట్టు తెలిపారు. ఇక త్వరలోనే ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణెం రాబోతుందని, ఈ విషయమై ఆర్‌బీఐతో మాట్లాడుతున్నట్లు పురందేశ్వరీ చెప్పారు.
Next Story