ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర..1623 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

By Knakam Karthik
Published on : 22 Aug 2025 4:08 PM IST

Telangana, Health Department, Specialist doctor posts, Notification

ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల జాతర..1623 పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణ ఆరోగ్యశాఖలో మరోసారి ఉద్యోగాల నియామక ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 1623 స్పెషలిస్ట్‌ డాక్టర్ పోస్టుల భర్తీకి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ హాస్పిటల్‌లో 7 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తులకు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకూ గడువు ఇస్తూ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉద్యోగాల భర్తీతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లోని హాస్పిటళ్లలో స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది.

జిల్లా, ఏరియా హాస్పిటళ్లు, కమ్యునిటీ హెల్త్ సెంటర్లలో వైద్య సేవలు మరింత మెరుగుకానున్నాయి. దీంతో పల్లెలకు స్పెషాలిటీ వైద్య సేవలు చేరువ కానున్నాయి. ఆరోగ్యశాఖలో ఇప్పటికే సుమారు 8 వేల పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేసింది. అదనంగ మరో 7 వేల పోస్టులకు భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది.

Next Story