త్వరలో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌!

తెలంగాణలో వేసవి సెలవులు ముగుస్తుండటంతో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది.

By అంజి
Published on : 1 Jun 2025 6:11 AM IST

Notification, Anganwadi posts, Telangana, Jobs

త్వరలో అంగన్‌వాడీ పోస్టులకు నోటిఫికేషన్‌!

తెలంగాణలో వేసవి సెలవులు ముగుస్తుండటంతో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. మహిళ దినోత్సవం (మార్చి 8న) రోజున 14,236 పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి సీతక్క ప్రకటించినా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి తీపికబురు అందలేదు. ఎస్సీ వర్గీకరణ కారణంతో గత కొంతకాలంగా ఉద్యోగ నోటిఫికేషన్లకు బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందా? అని మహిళలు ఎదురుచూస్తున్నారు.

అంగన్‌వాడీ కేంద్రాల్లో 6,399 టీచర్‌ పోస్టులు, 7,837 హెల్పర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. జూన్‌ చివరిలో లేదా జులై మొదటి వారంలో సర్పంచ్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున లేదా ఎలక్షన్లలోపు అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల 3,989 మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్‌ అంగన్‌వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోషన్‌ కల్పించింది. దీంతో మెయిన్‌ అంగన్‌వాడీలతో సమానంగా వారికి రూ.13,650 వేతనం అందనుంది.

Next Story