పాల డెయిరీ 'కంట్రీ డిలైట్‌' మోసం బట్టబయలు

హైదరాబాద్‌: ప్రముఖ పాలు, పాల ఉత్పత్తుల సంస్థ కంట్రీ డిలైట్‌ సంస్థ చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది.

By అంజి  Published on  3 Sep 2023 2:00 AM GMT
dairy company, Country Delight, Sangareddy, Telangana

పాల డెయిరీ 'కంట్రీ డిలైట్‌' మోసం బట్టబయలు

హైదరాబాద్‌: ప్రముఖ పాలు, పాల ఉత్పత్తుల సంస్థ కంట్రీ డిలైట్‌ సంస్థ చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది. పర్మిషన్‌ లేకుండానే రాష్ట్రంలో నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకాలు సాగిస్తున్నట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్‌ తీసుకోకుండా యథేచ్చగా కోట్ల రూపాయల్లో బిజినెస్‌ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. బ్రాండింగ్‌ మాటున చేస్తున్న ఈ వ్యాపార దందాను రాష్ట్ర ఆహార నాణ్యతా ప్రమాణాల విభాగం బయటపెట్టింది. సంగారెడ్డి జిల్లాలోని పటాన్‌చెరు మండలం చిన్నకంజర్ల గ్రామంలోని కంట్రీ డిలైట్‌ ప్లాంట్‌లో ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు శనివారం నాడు తనిఖీలు నిర్వహించారు.

రాష్ట్రంలో నెయ్యి, ఇతర ఉత్పత్తుల అమ్మకానికి ఎఫ్‌ఏఎస్‌ఎస్‌ఏఐ నుంచి అనుమతులు తీసుకోలేదని గుర్తించారు. రూ.52 లక్షల విలువ చేసే 1,500 లీటర్ల నెయ్యిని సీజ్‌ చేశారు. అలాగే కంట్రీ డిలైట్‌ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఈ కంట్రీ డిలైట్ ఫార్మ్‌ టు హోమ్‌, తాజా ఉత్పత్తులు అంటూ ప్రచారం చేస్తూ, నిల్వ చేసిన నెయ్యిని వినియోగదారులకు అందిస్తున్నారని తనిఖీల్లో తేలింది. ఫార్మ్ టు హోమ్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నారు. మిస్ బ్రాండింగ్ చేస్తూ ఈ కంట్రీ డిలైట్ అధికారుల చేతికి అడ్డంగా బుక్కయ్యారు. ప్లాంట్‌లోని అన్ని రకాల పాల ఉత్పత్తుల నుంచి నమూనాలు సేకరించామని జిల్లా అధికారి ధర్మేంద్ర తెలిపారు.

Next Story