హైదరాబాద్ ప్రజలకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ముఖ్య గమనిక జారీ చేశారు. నేడు మహావీర్ జయంతి సందర్భంగా నేడు నగరంలోని చికెన్, మటన్ సహా ఇతర మాంసం దుకాణాలు మూసివేయనున్నారు. ఈ మేరకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
నగరంలోని చికెన్, మటన్, బీఫ్ సహా చేపల దుకాణాలు నేడు మూసేయాలన్నారు. అన్ని కబేళాలు, రిటైల్ మాంసం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. జైనులకు పవిత్రమైన రోజు మహావీర్ జయంతి సందర్భంగా ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.