హైదరాబాద్: జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నికల సమర్థ నిర్వహణకు నోడల్ అధికారుల నియామకం జరిగింది. నోడల్ అధికారులను నియమిస్తూ హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ – ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఈవీఎం & వివిప్యాట్ నిర్వహణ – కూకట్‌పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌవన్, ట్రైనింగ్ – ఎల్.బి.నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్ – సి.టి.ఓ శ్రీనివాస్, మెటీరియల్ మేనేజ్మెంట్ – అడ్మిన్ అదనపు కమిషనర్ కె. వేణుగోపాల్, ఎంసిసి – అదనపు ఎస్.పి. (విజిలెన్స్) ఎం. సుదర్శన్, లా అండ్ ఆర్డర్, వల్నరబుల్ మ్యాపింగ్, డిస్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్లాన్ – డి.ఎస్.పి. నరసింహా రెడ్డి, ఎక్స్పెండిచర్ మానిటరింగ్ – చీఫ్ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎన్నికల పరిశీలకులు – అసిస్టెంట్ వెటర్నరీ అధికారి విల్సన్, డమ్మీ బ్యాలెట్ పేపర్ – సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవి కిరణ్, మీడియా కమ్యూనికేషన్ & ఎంసిఎంసి – సిపిఆర్‌ఓ సెక్షన్ పిఆర్‌ఓ ఎం. దశరథ్, సైబర్ సెక్యూరిటీ, ఐటి & కంప్యూటరైజేషన్ – ఐటి జాయింట్ కమిషనర్ సి. రాధా, హెల్ప్‌లైన్ & కంప్లైంట్ రీడ్రెస్సల్ – ఐటి ఏఈ కార్తీక్ కిరణ్, వెబ్‌కాస్టింగ్ – ఐటి ఏఈ తిరుమల కుమార్‌లను నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.