టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 15 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు

No ticket to Childrens below 15 years today.తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వీసీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Nov 2021 1:39 PM IST
టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. 15 ఏళ్ల లోపు పిల్ల‌ల‌కు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వీసీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న నిర్ణ‌యాల‌తో దూసుకువెలుతున్నారు. ప్ర‌జ‌లకు ఆర్టీసీని మ‌రింత చేరువ‌చేసి త‌ద్వారా సంస్థ‌ను లాభాల బాట‌ను ప‌ట్టించేందుకు ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. అందులో బాగంగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. నేడు(నవంబ‌ర్ 14న‌) బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా చిన్నారుల‌కు బంప‌ర్ ఆఫర్ ఇచ్చారు.

15 ఏళ్ల లోపు పిల్లలకు ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ సజ్జనార్ నిర్ణయం తీసుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్ల‌డించింది. ఈ రోజు చిన్నారుల‌కు టిక్కెట్ ఉండ‌ద‌ని.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డి నుంచి ఎక్క‌డైనా ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చున‌ని ప్ర‌క‌టించారు. ఏసీ, మెట్రో డీలక్స్, ఆర్డినరీ ఇలా ఏ బస్సు అయినా ఎక్కవచ్చున‌ని చెప్పారు. ఈ ఆఫర్‌‌ను చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు.

Next Story