నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై.. క్లారిటీ ఇదే..!

Nizamabad hospital video shared with false narration on social media. నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగిని స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడం అతడి సహాయకులు కాళ్లు పట్టుకుని

By M.S.R  Published on  15 April 2023 7:04 AM GMT
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై.. క్లారిటీ ఇదే..!

నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ రోగిని స్ట్రెచర్‌ అందుబాటులో లేకపోవడం అతడి సహాయకులు కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లారు. స్ట్రెచర్‌ అందుబాటులో లేదని ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో బయట నుంచి రెండో అంతస్థు లిప్ట్ వరకు రోగి బంధువులే అతని కాళ్లు పట్టుకుని ఈడ్చుకుంటూ వైద్యుని దగ్గరకు లాక్కెళ్లారు. రోగి కాళ్లు పట్టుకుని లాక్కెళ్తున్నా అక్కడి వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. బయటి నుంచి లిఫ్ట్ వరకు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారు. రెండు వారాల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆస్పత్రి సిబ్బంది తీరుపై జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ స్పందించారు. ఆస్పత్రికి వచ్చిన రోగుల పట్ల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలను ఖండించారు. ఆ రోగిని మార్చి 31 ఆస్పత్రికి తీసుకొచ్చారని, లిఫ్ట్ వచ్చిందనే తొందరలో అతడి సహాయకులే కాళ్లు పట్టుకుని లాక్కెళ్లరని, ఇందులో సిబ్బంది నిర్లక్ష్యమేమి లేదని అన్నారు.


Next Story