కరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. పీఎఫ్‌ఐ క్యాడర్' ఇళ్లే టార్గెట్‌గా..
కరీంనగర్ పట్టణంలో ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి.
By అంజి Published on 10 Aug 2023 6:45 AM GMTకరీంనగర్‌లో ఎన్‌ఐఏ సోదాలు.. పీఎఫ్‌ఐ క్యాడర్' ఇళ్లే టార్గెట్‌గా..
కరీంనగర్ పట్టణంలో ఎన్‌ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) అధికారులు సోదాలు కలకలం సృష్టించాయి. హుస్సేనీపురలో ఉంటుంటున్న ఓ వ్యక్తి ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ఎన్ఐఏతోపాటు, స్థానిక పోలీసులు కూడా పాల్గొన్నారు. ఉదయం నుంచి సుమారు ఐదు గంటలుగా ఈ సోదాలు చేశారు. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తున్నది. విదేశాల్లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. హుస్సేనీపురతోపాటు కార్ఖానాగడ్డ, నాకా చౌరస్తాలోని పలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు.
తబ్రేజ్ అనే వ్యక్తికి పీఎఫ్ఐ అనే నిషేధిత సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం తబ్రేజ్ దుబాయ్ లో ఉంటున్నట్లు గుర్తించారు. తెల్లవారు జామున 3-30 గంటలకి తబ్రేజ్ ఇంటికి వచ్చిన ఎన్‌ఐఏ అధికార బృందం.. దాదాపు ఐదు గంటలు 8-30 వరకి తబ్రేజ్ ఇంట్లో అధికారుల సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలక సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. అధికారులు కొన్ని పత్రాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అటు ఆదిలాబాద్‌లోని పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా నేత తదితరుల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. తెలంగాణలో గతేడాది ఎన్‌ఐఏ దాడులు నిర్వహించి పలువురు పీఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేసింది. వారిపై కఠిన యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. అరెస్టయిన వారు నిజామాబాద్, కరీంనగర్, జగతియాల్, ఆదిలాబాద్, హైదరాబాద్‌కు చెందిన వారు.