తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు
Next 3 days rain fall in telangana.తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు చల్లటి కబురు ఇది. రెండు రోజుల క్రితం కేరళను
By తోట వంశీ కుమార్ Published on 6 Jun 2021 1:50 PM GMT
తెలుగు రాష్ట్రాల్లోని రైతన్నలకు చల్లటి కబురు ఇది. రెండు రోజుల క్రితం కేరళను తాకిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేశాయి. దీంతో తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి బుతు పవనాలు ఆదివారం తమిళనాడు, కర్ణాటక అంతటా.. మహారాష్ట్ర లో కొంత భాగం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో మరి కొంత భాగం వ్యాపించాయని ఈశాన్య భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలోకి ప్రవేశించాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ , ఆంధ్రా రాష్ట్రాలలోని మెదక్, నల్గొండ, రెంటచింతల వరకు ఈరోజు బుతుపవనాలు ప్రవేశించినట్లు వాతావరణ కేంద్రం విడుదల చేసిన బులెటిన్‌లో వెల్లడించింది. ఇక మధ్య ప్రదశ్ నుండి మరాట్వాడా, తెలంగాణ, రాయలసీమ మీదగా ఉత్తర తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మి వరకు ఉపరితల ద్రోణి వ్యాపించింది. ఈనెల 3న కేరళను తాకిన నైరుతి బుతుపవనాలు బలంగా ముందుకు కదులుతున్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.