న్యూస్‌మీటర్ ఇంపాక్ట్‌: డెంటల్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం స్టైఫండ్‌ విడుదల

NewsMeter impact: Telangana govt releases stipend for dental students. న్యూస్ మీటర్ కథనంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. డెంటల్‌ విద్యార్థులకు స్టైఫండ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Dec 2022 8:12 AM GMT
న్యూస్‌మీటర్ ఇంపాక్ట్‌:  డెంటల్ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం స్టైఫండ్‌ విడుదల

న్యూస్ మీటర్ కథనంతో తెలంగాణ ప్రభుత్వం స్పందించి.. డెంటల్‌ విద్యార్థులకు స్టైఫండ్‌ విడుదల చేసింది. న్యూస్‌మీటర్‌ ద్వారా సమస్యను లేవనెత్తిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ డెంటల్ కాలేజీకి చెందిన 60 మంది విద్యార్థులు తమ పెండింగ్ స్టైఫండ్‌ను అందుకున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.22,327ల స్టైఫండ్‌ అందింది. తెలంగాణ ప్రభుత్వం రీయింబర్స్ చేసిన మొత్తం బకాయిలు రూ.6,698,100.

"ఈ బ్యాచ్ విద్యార్థులను లెక్కలోకి తీసుకోకపోవడంతో వారి చెల్లింపులు నిలిచిపోయాయి. దీంతో వారు వివిధ అధికారులను సంప్రదించారు. కానీ ఎటువంటి స్పందన లేదు. AIDSA వారి సమస్యను లేవనెత్తింది. ఈ సమస్యను ప్రచురించడంతో వెంటనే చర్య తీసుకోబడింది. మొత్తం స్టైఫండ్‌ విడుదల చేయబడింది" అని ఆల్ ఇండియా డెంటల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ Md మంజుర్ అహ్మద్ చెప్పారు.

టీఎస్‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ గమనించింది

తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కార్యాలయం న్యూస్‌మీటర్ కథనాన్ని గమనించి, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్‌ను వివరణ కోరింది. ఆరోగ్య మంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఫాలో-అప్ స్టైఫండ్‌ను త్వరగా విడుదల చేయడంలో సహాయపడిందని AIDSA వివరించింది.

సీనియర్ దంతవైద్యులు స్పందించారు

న్యూస్‌మీటర్ కథనాన్ని విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. వాస్తవానికి, 30 నుండి 40 దంతవైద్యుల వాట్సాప్ గ్రూపులు కథనాన్ని ఫార్వార్డ్ చేశాయి. సీనియర్ దంతవైద్యులు కూడా ఇది భారీ స్థాయిలో ప్రభావాన్ని సృష్టించడాన్ని గమనించారు. ఈ అంశాలన్నీ స్టైఫండ్ విడుదలకు దారితీశాయి.

Next Story