తెలంగాణ ప్రభుత్వం నలుగురు సమాచార కమిషనర్లను నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొత్తగా నియమితులైన కమిషనర్లు జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఆర్టీఐ నూతన కమిషనర్లుగా నియమితులైన పీవీ శ్రీనివాస రావు గారు, మొహిసినా పర్వీన్ గారు, దేశాల భూపాల్ గారు, బోరెడ్డి అయోధ్యా రెడ్డి గారు ముఖ్యమంత్రిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డిని కుటుంబ సమేతంగా నూతన సమాచార కమిషనర్లు పీవీ శ్రీనివాసరావు, బోరెడ్డి అయోధ్యరెడ్డి, దేశాల భూపాల్, మొహిసినా పర్వీన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు శాలువాలు కప్పి పుష్పగుచ్చం అందజేశారు.
కాగా, గత కొన్నేళ్లుగా ఆర్టీఐ కమిషనర్ పదవులు ఖాళీగా ఉండటంతో, పౌరులకు సమయానికి సమాచారం లభించడంలో జాప్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నూతనంగా నియామకాలు చేపట్టడం పౌర హక్కుల పరిరక్షణలో కీలక ముందడుగు పడింది. ప్రస్తుతం నియమితులైన కమిషనర్లు వేర్వేరు రంగాల్లో అనుభవం కలిగి ఉన్నవారు. వారి అనుభవం సమాచార హక్కు అమలులో నాణ్యతను మెరుగు పరచడానికి తోడ్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.