Telangana: మద్యంప్రియులకు శుభవార్త.. రాష్ట్రంలోకి కొత్తరకం బీర్లు!
తెలంగాణలో కొంతకాలంగా బీర్ల కొరత ఏర్పడింది.
By Srikanth Gundamalla Published on 27 May 2024 9:33 AM GMTTelangana: మద్యం ప్రియులకు శుభవార్త.. రాష్ట్రంలోకి కొత్తరకం బీర్లు!
తెలంగాణలో కొంతకాలంగా బీర్ల కొరత ఏర్పడింది. వేసవి ప్రారంభం నుంచే వీటి సంఖ్య తగ్గిపోయింది. మద్యం ప్రియులు చాలా మంది వైన్‌షాపుల వద్దకు వెళ్లి నో బీర్ల బోర్డులను చూసి నిరాశగా వెనక్కి తిరిగి వస్తున్నారు. ఇక కొందరు అయితే ఏకంగా అధికారులకే ఫిర్యాదు చేశారు. బీర్ల కొరతను తీర్చాలని కోరారు. మద్యం దుకాణాల్లో బీర్లను అందుబాటులో ఉంచాలంటూ పలువురు ఎక్సైజ్ ఆఫీస్‌కు కంప్లైంట్ చేశారు. అయినా.. కూడా బీర్లు సరిపడినంత దొరకడం లేదు.
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో కొత్త బీర్లకు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో తమ బీర్ బ్రాండ్‌లను సరఫరా చేయడానికి సోమ్ డిస్టిలరీస్ అనుమతి పొందినట్లు తెలుస్తోంది. ఇక తాజాగా సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంతో కొత్త బీర్లు రానున్నాయి తెలంగాణలోకి. పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.
మరోవైపు తెలంగాణలో గత మూడు నెలలుగా బీర్లు దొరకడం లేదనీ.. దీని వెనుక భారీ కుట్ర జరుగుతున్నట్లు పలు మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. కమిషన్ బట్టి తెలంగాణలో కొత్త బ్రాండ్లకు గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయనీ వార్తలు వినిపించాయి. ఎన్నికల ఫలితాల తర్వాత కొన్ని బ్రాండ్ల బీర్లు రాష్ట్రానికి వచ్చే చాన్స్ ఉందని కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి. ముందుగా మద్యం కొరత సృష్టించి.. దీన్ని సాకుగా చూపుతూ కొత్త బ్రాండ్లను పరిచయం చేయాలనీ.. తద్వారా భారీగా కమిషన్ పొందాలని ప్రభుత్వం ప్లాన్ చేసినట్లు కొన్ని కథనాల్లో పేర్కొన్నారు.