తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్

National Green Tribunal slaps Telangana with a ₹3,800 cr fine.తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్

By M.S.R  Published on  4 Oct 2022 4:21 PM IST
తెలంగాణ ప్రభుత్వానికి ఊహించని షాక్

తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.3800 కోట్ల జరిమానాను విధించింది. వ్యర్థాల నిర్వహణలో మార్గదర్శకాలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ భారీ జరిమానాను విధించింది. 1996లో మున్సిపాలిటీల్లో పారిశుధ్య వ్యర్ధాల నిర్వహణ సరిగా లేదని పర్యావరణ సురక్షా అనే స్వచ్చంధ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. ఈ పిటిషన్ ను విచారించిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఘన,ద్రవ వ్యర్ధాల నిర్వహణపై అన్ని రాష్ట్రాలకు ఎన్జీటీ నోటీసులు పంపింది. ఈ విషయమై అన్ని రాష్ట్రాల నుండి సమాధానాలను ఎన్జీటీ పరిశీలించింది. తెలంగాణ నుండి వచ్చిన సమాధానం సంతృప్తిగా లేకపోవడంతో ఎన్జీటీ రూ. 3800 కోట్లు జరిమానాను విధించింది. ఈ జరిమానాను రెండు నెలల్లో డిపాజిట్ చేయాలని ఎన్జీటీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇక వ్యర్థ పదార్థాల నిర్వహణ విధానాల అమలులో విఫలమయ్యారంటూ మహారాష్ట్రకు రూ.12 వేల కోట్లు, పశ్చిమ బెంగాల్ కు రూ.3,500 కోట్లు, రాజస్థాన్ కు రూ.3 వేల కోట్లు, పంజాబ్ కు రూ.2,080 కోట్ల జరిమానా విధించింది.

Next Story