Nalgonda: రోడ్డు ప్రమాదంలో 14 ఆవులు మృతి

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మంగళవారం పశువుల మందను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి.

By అంజి  Published on  21 March 2023 3:40 PM IST
road accident, Nalgonda

Nalgonda: రోడ్డు ప్రమాదంలో 14 ఆవులు మృతి

తెలంగాణలోని నల్గొండ జిల్లాలో మంగళవారం పశువుల మందను ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో 14 ఆవులు మృతి చెందాయి. అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై బుగ్గబావిగూడెం గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మరో ఆరు ఆవులకు కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ తెల్లవారుజామున చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ప్రైవేట్ బస్సు పశువుల మంద రోడ్డు దాటుతుండగా ఢీకొంది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని, వాహనం అతివేగంతో వెళ్లిందని పశువుల యజమాని తెలిపాడు. తనను కాపాడుకునేందుకు పక్కకు వెళ్లానని రైతు చెప్పాడు. బస్సు ప్రయాణికులకు ఎలాంటి గాయాలు అయినట్లు సమాచారం లేదు. ఒక్కొక్క ఆవు ధర రూ. 40 వేల వరకు ఉంటుందని రైతు చెప్పాడు. ఈ లెక్కన రైతుకు రూ.7 లక్షల నష్టం వాటిల్లింది. రైతు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని పరిశీలించారు.

Next Story