మంత్రి హరీశ్‌రావుకు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్

మల్కాజిగిరి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  21 Aug 2023 7:31 AM GMT
Mynampally hanumantha rao, fire, harish rao, BRS,

మంత్రి హరీశ్‌రావుకు BRS ఎమ్మెల్యే స్ట్రాంగ్ వార్నింగ్ 

మల్కాజిగిరి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీష్ రావుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేటలో తన తడాఖా చూపిస్తానని.. హరీశ్‌రావు అడ్రస్‌ గల్లంతు చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మంత్రి హరీశ్‌రావుపై మల్కాజిగిరి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్‌లో ప్రచారం చేయడానికి హరీశ్‌ రావు ఎవరు అటూ ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా మల్కాజిగిరి నుంచి తాను, మెదక్‌ నుంచి తన కుమారుడు రోహిత్‌ పోటీ చేస్తామని చెప్పారు. ఎవరు అడ్డుకుంటారో చూస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి హన్మంతరావు. హరీశ్‌రావు రబ్బర్‌ చెప్పులు, ట్రంక్‌ పెట్టెతో హాస్టల్‌కు వచ్చిన రోజులు మర్చిపోవద్దని.. ఇప్పుడు ఏస్థాయిలో ఉన్నాడో అందరూ గమనించాలని అన్నారు. నూటికి నూరు శాతం మంత్రి హరీశ్‌రావుకు బుద్ధి చెబుతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

మెదక్‌లో అభివృద్ధిని అడ్డుకున్నది మంత్రి హరీశ్‌రావే అని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు. మొదటగా మెదక్‌ జిల్లా, మల్కాజిగిరి అనంతరం సిద్దిపేటలోనూ హరీశ్‌రావు అడ్రస్‌ లేకుండా చేస్తానని దేవుడిమీద ప్రమాణం చేస్తున్నానని అన్నారు. హన్మంతరావు మాట ఇస్తే తప్పడని.. హరీశ్‌రావుని గద్దె దించడం ప్రజలే చూస్తారని అన్నారు. హరీశ్‌రావు దుకాణం బంద్‌ చేసేంత వరకూ నిద్రపోనని వెంకటేశ్వరస్వామి మీద ప్రమాణం చేసి చెప్తున్నానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.

గత కొన్నాళ్లుగా మైనంపల్లి కుమారుడు రోహిత్‌ మెదక్‌ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి మెదక్ టికెట్‌ బీఆర్ఎస్‌ నుంచి తన కుమారుడికి వస్తుందని హన్మంతరావు కూడా ఆశించారు. కానీ చివరి నిముషంలో మెదక్‌ స్థానం నుంచి పద్మా దేవేందర్‌రెడ్డి పేరు ఖరారు చేశారని వార్తలు వచ్చాయి. దాంతో.. మైనంపల్లి హన్మంతరావు మంత్రి హరీశ్‌రావు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనే చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు మైనంపల్లి హన్మంతరావు.

Next Story