ములుగు జెడ్పీ చైర్మన్‌ జగదీష్‌ హఠాన్మరణం.. సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్

By అంజి
Published on : 11 Jun 2023 1:02 PM IST

Mulugu ZP Chairman, Kusuma Jagdish, heart attack, CM KCR

ములుగు జెడ్పీ చైర్మన్‌ జగదీష్‌ హఠాన్మరణం.. సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి

ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీలో విషాదం నెలకొంది. ములుగు జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండెపోటుతో ఆదివారం కన్నుమూశారు. గుండెపోటుతో హన్మకొండలోని అజార హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. జగదీష్ అకాల మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల సీఎం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు భగవంతుడు అండగా ఉండాలని ప్రార్థించారు.

తెలంగాణ ఉద్యమకారుడిగా, జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా, ములుగు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగదీశ్‌ చేసిన సేవలను తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని సీఎం గుర్తు చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. జగదీష్‌ మృతిపట్ల స్థానిక నాయకులు, కార్యకర్తలు సంతాపం తెలుపుతున్నారు. ఆయన చేసిన అభివృద్ధి పనులను జిల్లా ప్రజలు మనన చేసుకుంటున్నారు.

Next Story