ఆమె రాజకీయ జీవితం ముగిసింది : ధర్మపురి అర్వింద్

MP Darmapuri Arvind Fire On MLC Kavitha. టీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసం వద్ద విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే.

By M.S.R  Published on  18 Nov 2022 10:13 AM GMT
ఆమె రాజకీయ జీవితం ముగిసింది : ధర్మపురి అర్వింద్

టీఆర్ఎస్ కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ నివాసం వద్ద విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన దిష్టి బొమ్మ దహనం చేయడంతో పాటు ఇంట్లోకి దూసుకెళ్లి అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. ఇంట్లో ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశారు. బంజారాహిల్స్ లోని అర్వింద్ నివాసంలోకి చొరబడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలు కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆయన ఇంటి ముందు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ ఘటనపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి కుల అహంకారం పెరిగిపోయిందని, అదే కుల అహంకారంతో ఇవాళ తన ఇంటిపై దాడి చేశారని ఆరోపించారు. మహిళలపై దాడి చేయమని టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరు చెప్పారని నిలదీశారు. ఇంట్లో తన తల్లితో పాటు మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ పై దాడి చేశారని ఆరోపించారు.

కవిత రాజకీయ ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని.. ఆమె రాజకీయ జీవితం ముగిసిందన్నారు. కవిత తనపై పోటీ చేసి ఓడిస్తానని చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. కాంగ్రెస్‌లో చేరేందుకు కవిత ప్రయత్నాలు చేసిందని తాను చెప్పినందుకే దాడి చేస్తే మరి బీజేపీ నుంచి కవితకు ఆఫర్ వచ్చిందని కేసీఆరే అన్నారు.. మరి మీ నాన్నను చెప్పుతో కొట్టావా? అని ప్రశ్నించారు. కవిత నాపై చీటింగ్ కేసు వేయడం కాదు. మేనిఫెస్టోలో హామీ ఇచ్చి నెరవర్చని ఆమె తండ్రిపై కేసు వేసుకోవాలని సూచించారు. 178 మంది పసుపు రైతులు నిజామాబాద్ లో నామినేషన్లు వేస్తే అందులోని 71 మంది బీజేపీ కండువాలు కప్పుకున్నారని చెప్పారు. రైతులంతా బీజేపీ వైపు చూస్తుంటే నామీద చీటింగ్ కేసు ఏం పెడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళను అని సానుభూతి పొందాలనుకునే కవిత తన ఇంట్లో ఉన్న మహిళలపై దాడి చేయించడం ఏంటని ప్రశ్నించారు. తన తల్లిపై దాడి చేసే హక్కు కవితకు ఎవరిచ్చారన్నారు. ఇళ్లు ధ్వంసం చేయడం, దేవుడి పటాలను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు.


Next Story