పాత వాళ్లు పోయి కొత్త కళాకారుడు వచ్చాడు : బీజేపీ అధ్య‌క్షుడిపై కాంగ్రెస్‌ ఎంపీ సెటైర్లు

బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని ఎంపీ చామల కిరణ్ సెటైర్లు సంధించారు.

By Medi Samrat
Published on : 15 July 2025 6:30 PM IST

పాత వాళ్లు పోయి కొత్త కళాకారుడు వచ్చాడు : బీజేపీ అధ్య‌క్షుడిపై కాంగ్రెస్‌ ఎంపీ సెటైర్లు

బీజేపీలో పాత కళాకారులు పోయి కొత్త కళాకారుడు వచ్చాడని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్ సెటైర్లు సంధించారు. రాంచందర్ రావు మాటల్లో సబ్జెక్ట్ లేదు.. ఆయ‌న‌కు మతి మరుపు ఉన్నట్లు ఉందన‌కుంట‌.. గత పదేళ్ల తప్పిదాలను కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దుతున్నారని అన్నారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రేషన్ కార్డులలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫోటో ఎందుకు పెట్టలేదని ప్ర‌శ్నించారు. RRR , మెట్రో ఫేజ్-2 దగ్గర మోడీ ఫోటోలు పెడతామ‌న్నారు.

బ్రిటీష్ హాయాంలోనే కొందరు మైనారిటీ ముస్లింలను బీసీలలో చేర్చారు.. బీజేపీ పాలిత రాష్ట్రాలలో కూడా మైనారిటీ ముస్లిం లు బీసీలలోనే ఉన్నారు.. రాంచందర్ రావు విషయపరిజ్ణానం పెంచుకుంటే మంచిదన్నారు. గత పదేళ్ళలో ఏరోజైనా తుంగతుర్తి అభివృద్ధి గురించి జగదీష్ రెడ్డి మాట్లాడాడా..? గంజి లేని జగదీష్ రెడ్డి బెంజ్ లో ఎలా తిరుగుతున్నాడని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

Next Story