దేశంలో వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రియుళ్ల కోసం భర్తలను కడతేర్చిన ఘటనలు ఇప్పటికే జరుగుతూనే ఉన్నాయి. అయితే నల్గొండ జిల్లాలో మాత్రం ఓ మహిళ కన్న కొడుకును బస్టాండ్‌లో అనాథగా వదిలేసి ప్రియుడితో వెళ్లిపోయింది. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక.. బిక్కుబిక్కుమంటూ ఏడుస్తున్న 15 నెలల ఆ చిన్నారిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో.. వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించారు. ఆమె భర్తను పిలిపించి.. బిడ్డను ఆయనకు అప్పగించారు.
నల్లగొండ పాతబస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైదరాబాద్‌కు చెందిన వివాహితకు ఇన్ స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. ఆమెకు భర్త, 15 నెలల బాబు ఉన్నారు. వారిని వదిలేసి మహిళ ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది. డైరెక్ట్‌గా నల్గొండ ఆర్టీసీ బస్టాండ్‌కు బాబుతో పాటు వచ్చి.. చిన్నోడిని అక్కడే వదిలేసి వదిలేసి ఆ యువకుడితో జంప్ అయింది. బాబు తప్పిపోయాడన్న సమాచారంతో పోలీసులు అక్కడికి వెళ్లారు.. బస్టాండ్‌లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా..బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు "మమ్మీ" అంటూ గుర్తించాడు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలింది.