షాదీ ముబారక్: 8 ఏళ్లలో 2 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలకు లబ్ధి

More than 2 lakh women have benefited through Shadi Mubarak scheme in 8 years. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన.. షాదీ ముబారక్ స్కీమ్‌ కింద గడిచిన 8 సంవత్సరాలలో

By అంజి  Published on  19 Dec 2022 10:39 AM IST
షాదీ ముబారక్: 8 ఏళ్లలో 2 లక్షల కంటే ఎక్కువ మంది మహిళలకు లబ్ధి

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన.. షాదీ ముబారక్ స్కీమ్‌ కింద గడిచిన 8 సంవత్సరాలలో 2 లక్షల కంటే ఎక్కువ మహిళలు లబ్ధి పొందారు. తెలంగాణ ప్రభుత్వం 2014లో మైనారిటీల సామాజిక అభివృద్ధి కోసం షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. షాదీ ముబారక్ పథకం కింద 2014లో 2,11,285 మంది లబ్ధి పొందినట్లు ఆర్టీఐ వెల్లడించింది. కరీం అన్సారీ ఆర్టీఐ దాఖలు చేశారు. "ఇది చాలా మంచి పథకం అని నేను గట్టిగా నమ్ముతున్నాను. అయితే, చాలా మంది మహిళలకు చాలా ఆలస్యంగా డబ్బు అందుతున్నట్లు నేను చూశాను. ఇది మారుతుందని ఆశిస్తున్నాను" అని అతను చెప్పాడు.

కరీన్ తన ఆర్టీఐలో జిల్లాల వారీగా, వయస్సు వారీగా డేటాను కోరారు. అయితే ఆర్టీఐ దగ్గర వయస్సు వారీగా డేటా అందుబాటులో లేదు.

షాదీ ముబారక్ అంటే ఏమిటి?

తెలంగాణ ప్రభుత్వం 2014లో మైనార్టీల సామాజిక అభివృద్ధి కోసం షాదీ ముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం మైనారిటీ బాలికలకు వారి వివాహ సమయంలో 51,000 అందిస్తుంది. 2017లో ఆర్థిక సాయాన్ని రూ.51,000 నుండి రూ. 75,116. పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

ఈ స్కీమ్‌ కోసం 2021-22 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వం రూ.1,688.54 కోట్లు విడుదల చేసింది. అత్యధిక మొత్తం-రూ. 356.04 కోట్లు-2019-20లో పంపిణీ చేయబడింది. 2018-19 మరియు 2020-21లో రూ. 291.40 కోట్లు పంపిణీ చేశారు.

ఈ పథకం ప్రారంభించిన మొదటి సంవత్సరాల్లో ఈ సంక్షేమ పథకం తీసుకునేవారు చాలా తక్కువ. రాష్ట్రవ్యాప్తంగా 5,443 మంది లబ్ధిదారులు మాత్రమే నమోదయ్యారు. మరుసటి సంవత్సరం (2015-16) సంఖ్యలు 27,695కి పెరిగాయి.

హైదరాబాద్‌లో ఎక్కువ మంది లబ్ధిదారులు

మొత్తం లబ్ధిదారుల్లో సగానికి పైగా హైదరాబాద్‌కు చెందినవారే. 2014-2022 మధ్య (మార్చి వరకు), 1,81,378 మంది వ్యక్తులు షాదీ ముబారక్ పథకం నుండి ప్రయోజనం పొందారు. ఆ తర్వాత ఇతర జిల్లాలు రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఇదిలా ఉంటే.. జనగాం, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, ములుగు, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ పథకం కోసం చాలా తక్కువ దరఖాస్తులు వచ్చాయి.

సంక్షేమ పథకాన్ని నిలిపివేయాల్సిన అవసరం ఉందని 'వేర్ ఆర్ ది ఉమెన్' గ్రూపునకు చెందిన వర్షా భార్గవి అన్నారు. "ఈ పథకం బాల్య వివాహాన్ని ప్రోత్సహిస్తుంది. పెళ్లి తర్వాత డబ్బు ఇచ్చే బదులు, డబ్బును స్త్రీకి ఇవ్వవచ్చు, తద్వారా ఆమె దానిని వివాహం లేదా విద్య కోసం ఉపయోగించుకోవచ్చు," ఆమె చెప్పింది.

పథకం కోసం అర్హత ప్రమాణాలు

· అవివాహిత అమ్మాయి మైనారిటీ కమ్యూనిటీకి చెందినది, తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి.

· పెళ్లి కాని అమ్మాయి వివాహ సమయానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.

· పేర్కొన్న అమ్మాయి వివాహం 2 అక్టోబర్ 2014న లేదా ఆ తర్వాత జరుగుతుంది.

· ఇంకా, తల్లిదండ్రుల ఉమ్మడి ఆదాయం సంవత్సరానికి రూ.2 లక్షలు మించకూడదు.

Next Story