Karimnagar: విషాదం.. రోడ్డు ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి
కరీంనగర్ పట్టణ శివార్లలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ రజిత మృతి చెందింది.
By అంజి Published on 31 March 2023 12:11 PM IST
Karimnagar: విషాదం.. రోడ్డు ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ మృతి
కరీంనగర్ పట్టణ శివార్లలోని సిరిసిల్ల బైపాస్ రోడ్డులో ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో మోడల్ స్కూల్ టీచర్ రజిత మృతి చెందింది. రజిత ద్విచక్ర వాహనాన్ని కాంక్రీట్ మిక్సర్ లారీ ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కరీంనగర్ పట్టణం అల్కాపురి కాలనీకి చెందిన రజిత రాజన్న -సిరిసిల్ల జిల్లా ఇల్లందకుంట మండలం రహీంఖాన్‌పేట మోడల్ స్కూల్‌లో గణిత ఉపాధ్యాయురాలు (పీజీటీ). ఆమె హెల్మెట్ ధరించినప్పటికీ, ఆమె అక్కడికక్కడే మరణించిందని పోలీసులు తెలిపారు. కరీంనగర్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ తెల్లవారుజామున ఒడిశాలోని సంబల్‌పూర్ జిల్లాలో కారు అదుపు తప్పి కాలువలో పడింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పరమన్‌పూర్ లో పెళ్లికి వెళ్లి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు ఝార్సుగూడ జిల్లాలోని బదాధార గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో బొలెరోలో 11 మంది ఉన్నారని తెలిపారు. సంబాల్‌పూర్‌లోని పరమన్‌పూర్ జరిగిన ఓ పెండ్లికి హాజరయ్యారయ్యారని, తిరుగుప్రయాణంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు చెప్పారు.