Telangana Polls: మాక్‌ పోలింగ్‌ షురూ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రిసైడింగ్‌ అధికారులు పోల్‌ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.

By అంజి  Published on  30 Nov 2023 12:44 AM GMT
Mock polling, Telangana, Telangana Polls, Election Commission

Telangana Polls: మాక్‌ పోలింగ్‌ షురూ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా మాక్‌ పోలింగ్‌ ప్రారంభమైంది. ప్రిసైడింగ్‌ అధికారులు పోల్‌ ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంలతో మాక్‌ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. తొలుత ఏజెంట్లు 50 ఓట్లు వేసిన తర్వాత సిబ్బంది వారి ఎదుటే లెక్కిస్తారు. తర్వాత కంట్రోల్‌ యూనిట్‌లోని మెమొరీని డిలీట్‌ చేసి, వీపీ ప్యాట్‌ కంటైనర్‌ బాక్స్‌ నుంచి మాక్‌ ఓటింగ్‌ స్లిప్పులను తీసేస్తారు. ఉదయం 7 గంటల నుంచి అసలైన పోలింగ్‌ ప్రారంభిస్తారు. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌ ముగియనుంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు అన్ని బూత్‌ల వద్ద ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌ పరిధిలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రోస్‌ చర్యలు చేపట్టారు. ఇందు కోసం పోల్‌ క్యూ రూట్‌ అనే పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చారు.ఇందులో నియోజకవర్గం, పోలింగ్‌ స్టేషన్‌ వివరాలను నమోదు చేసి సెర్చ్‌ చేస్తే.. క్యూలో వేచి ఉండాల్సిన సమయాన్ని చూపిస్తుంది. అధికారులుల ఎప్పటికప్పుడు వివరాలను అప్డేట్‌ చేస్తూ ఉంటారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో 50 శాతం లోపే పోలింగ్‌ నమోదు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఇప్పటికే పట్టణాలు, నగరాల నుంచి సొంత గ్రామాలకు తరలి వెళ్లారు.

అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలతో నిఘా పెట్టగా.. 50 శాతం పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌ క్యాస్టింగ్‌ జరగనుంది. ఎన్నికల విధుల్లో దాదాపు 2.5 లక్షల మంది సిబ్బంది, 55 వేల మంది తెలంగాణ పోలీసులు, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిసా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన 23,500 మంది హోంగార్డులు భద్రతా ఏర్పాట్లలో పాల్పంచుకుంటున్నారు. అలాగే, 375 కేంద్ర (సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ర్యాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌, ఇండో టిబెటన్‌ బోర్డర్‌) భద్రతా బృందాలు రాష్ట్రవ్యాప్తంగా విధుల్లో ఉన్నాయి.

Next Story