తొలిసారి ఓ వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

MLC Kavitha Fire On Darmapuri Aravind. బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై చెప్పుతో కొడతానంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

By M.S.R  Published on  18 Nov 2022 3:36 PM IST
తొలిసారి ఓ వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై చెప్పుతో కొడతానంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోపంతో ఊగిపోయారు. కవిత టీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరబోతున్నారని.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో ఆమె మాట్లాడారని అర్వింద్ చెప్పారని.. మాట్లాడే ముందు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు కవిత. ఎంత పడితే అంత మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఇంకోసారి పార్టీ మారుతోందని తన గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానని కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్దాచిన్నా అనేది కూడా లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి కూడా నీచంగా మాట్లాడాడని, అనరాని మాటలు అన్నాడని.. తమాషాలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. రాజకీయం చేస్తే పర్వాలేదని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఊరుకోబోమని కవిత అన్నారు. అర్వింద్ తెలంగాణలో ఎక్కడ పోటీ చేసినా తాను ఆయనపై పోటీ చేసి చిత్తుగా ఓడిస్తానని చెప్పారు. పసుపు బోర్డు తీసుకురాలేనని అర్వింద్ రైతుల కాళ్లు పట్టుకుని క్షమాపణ కోరాలని అన్నారు. రాజస్థాన్ లో చదువుకున్నట్టు అర్వింద్ ఫేక్ సర్టిఫికెట్ పెట్టాడని, ఆ యూనివర్శిటీనే లేదంటున్నారని, ఈ విషయం గురించి ఈసీకి ఫిర్యాదు చేస్తానని కవిత చెప్పారు. తాను ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి గురించి వ్యక్తిగతంగా మాట్లాడలేదని... తొలిసారి మాట్లాడానని కవిత చెప్పారు.


Next Story