జ‌గ‌న్ లాగే కేసీఆర్ కూడా స‌భ ర‌ద్దు చేసుకోవాలి

MLC Jeevan Reddy About KCR Sagar Meeting. సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రచారం జోరందుకుంటోంది.

By Medi Samrat  Published on  11 April 2021 9:11 PM IST
KCR, Jagan

సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది ప్రచారం జోరందుకుంటోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగానే ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించ తలపెట్టింది అధికార పార్టీ. అయితే, కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్.. బహిరంగ సభను రద్దు చేసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు.

ఈరోజు జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో, నల్లగొండలో కరోనా కేసులు పెరుగుతున్నాయని అన్నారు. ఈ సందర్భంలో బహిరంగ సభ నిర్వహిస్తే కరోనా మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో కరోనా కారణంగా సీఎం జగన్.. సభ రద్దు చేసుకున్నారని జీవన్ రెడ్డి గుర్తుచేశారు. అదే విధంగా కేసీఆర్ కూడా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టకొని సభ రద్దు చేసుకోవాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.


Next Story