రజాకార్లకు రేవంత్ రెడ్డి పాలన చూస్తే కంటగింపుగానే ఉంటుంది

కేటీఆర్ బావమరిది రాజ్ పకాల ఇంట్లో సోదాలు జరిగాయి. మంత్రిగా పని చేసిన వ్యక్తికి ఎక్సైజ్ అధికారులు ఎలా తనిఖీలు చేస్తారో తెలియకపోవడం సిగ్గు చేటు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు.

By Medi Samrat  Published on  28 Oct 2024 6:03 PM IST
రజాకార్లకు రేవంత్ రెడ్డి పాలన చూస్తే కంటగింపుగానే ఉంటుంది

కేటీఆర్ బావమరిది రాజ్ పకాల ఇంట్లో సోదాలు జరిగాయి. మంత్రిగా పని చేసిన వ్యక్తికి ఎక్సైజ్ అధికారులు ఎలా తనిఖీలు చేస్తారో తెలియకపోవడం సిగ్గు చేటు అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇంట్లో పార్టీ చేసుకున్న.. లిమిట్ కి మించి మద్యం ఉపయోగిస్తే పర్మిషన్ తీసుకుంటారు. కేటీఆర్ కి ఈ విషయం తెలియదా..? అని ప్ర‌శ్నించారు. 111 జీఓ తో ఇల్లు ఎలా కట్టుకున్నారు..? గృహ ప్రవేశ వేడుకలో లిక్కర్ సర్వ్ చేసేందుకు పర్మిషన్ తీసుకోవాలి కదా..? పరిసర ప్రాంతాల ప్రజలకు ఇబ్బందిగా ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. లిక్కర్ బాటిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయి.. అనేది పరిశీలిస్తే.. అడ్డంగా దొరికారు. ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేయడానికి వారెంట్ అవసరం లేదు. NDPS యాక్ట్ లో నార్కోటిక్స్ కంట్రోల్ చేయడానికి వారికి అధికారం ఉంటుందన్నారు. మిడిమిడి జ్ఞానం తో మాట్లాడుతున్నారు.. చట్టాలు తెలియకుండా మాట్లాడి కేటీఆర్ నవ్వుల పాలు అవుతున్నారని ఎద్దేవా చేశారు.. రేవ్ పార్టీ అని ఏ అధికారి చెప్పలేదు.. ప్రభుత్వం, సీఎం మీద ఎందుకు విరుచుకుపడుతున్నారు.. తెలంగాణ లో కోవర్ట్ ఆపరేషన్ లు మీ ఏలుబడిలో వచ్చినవే కదా అని దుయ్య‌బ‌ట్టారు.

జూబ్లీహిల్స్ లో హై లైఫ్ పబ్ కి ఓనర్స్ షిప్ లో రాజ్ పాకాల కు భాగం ఉంది.. రాజ్ పాకాల పర్మిషన్ ఇప్పించిన అనేక పబ్బుల్లో డ్రగ్స్ సరఫరా జరిగేది. గోవాలో కూడా సన్ బర్న్ రద్దు చేశారు. అటువంటి సన్ బర్న్ ఈవెంట్ హైదరాబాద్ లో చేసేందుకు ఒప్పందం చేసుకుంటే ప్రజా సంఘాలు వ్యతిరేకించారన్నారు. ఒకరికి డ్రగ్ టెస్ట్ చేస్తే ఒకరికి పాజిటివ్ వచ్చింది.. అంటే అధికారులను వారి విధులు సక్రమంగా నిర్వహించారు అని అభినందించాలి. ఓనర్ లేకుండా అతిథులు వస్తారా..? పార్టీ జరుగుతుందా..? అని ప్ర‌శ్నించారు.

రాజ్ పాకాలకు నార్కోటిక్స్ టెస్ట్ చేస్తే పాజిటివ్ వ‌స్తుంది అనే భయంతోనే తప్పించుకుని ముందుస్తు అరెస్ట్ నుండి తనను కాపాడుకోవడానికి కోర్టులో పిటిషన్ వేశారన్నారు. పదేళ్లు పాలించిన వాళ్ళు చట్టం ముందు ఉదాహరణగా ఉండాలన్నారు. రాజ్ పాకాల పారిపోకుండా ఉంటే.. కేటీఆర్ చెప్పే మాటలకు అర్ధం ఉండేదన్నారు. రాజ్ పాకాల కూడా డ్రగ్స్ సేవించారు అనే అనుమానం ప్రజలకు కలుగుతుందని.. ఇందులో రేవంత్ రెడ్డి, ఇతరుల ప్రమేయం ఎలా ఉంటుంది.? అని ప్ర‌శ్నించారు.

మూసీ DPR కాలేదు అప్పుడే అవినీతి బయటపడుతుందని.. జన్వాడా పార్టీ తెరపైకి అని హరీష్ రావు అంటున్నాడు. కాళేశ్వరం, విద్యుత్, భూదాన్ భూముల స్కాం లు బయటకి వస్తున్నాయన్నారు. కేటీఆర్ కి మిత్రుడిగా సలహా ఇస్తున్న.. విజయ్ మద్దూరికి రాజ్ పాకాల డ్రగ్స్ ఇచ్చాడని స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇది నిజం కాకపోతే రాజ్ పాకాల లొంగిపోయి స్టేట్మెంట్ తప్పు అని చెప్పాలన్నారు. ఎదురుదాడి అన్నింటిలో పనికి రాదు కేటీఆర్.. మీ బావమరిదిని వెనకేసుకు రాకండి.. కేటీఆర్ మీకు మీరు రాజకీయ సమాధి చేసుకున్నట్లు అవుతుందన్నారు. ఇటువంటి బావమరుదులు ఉంటే క్యారెక్టర్ దెబ్బతినకుండా ఉంటుందా.? ఇది సెల్ఫ్ గోల్.. బాంబులు కావు.. ఇవేం బాంబులు.. కాళేశ్వరం, విద్యుత్, భూదాన్ భూములు అవి బాంబులు అంటే.. రజాకార్లకు రేవంత్ రెడ్డి పాలన చూస్తే కంటగింపుగానే ఉంటుందన్నారు.

Next Story