ఈటల‌ను ప‌రామ‌ర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు

MLA Rajasingh says Eatala Padayatra starts again soon.హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్రలో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Aug 2021 7:11 AM GMT
ఈటల‌ను ప‌రామ‌ర్శించిన బీజేపీ ఎమ్మెల్యేలు

హుజురాబాద్‌ నియోజకవర్గంలో పాదయాత్రలో అస్వస్థతకు గురైన బీజేపీ నేత ఈటల రాజేందర్ జూబ్లీహిల్స్ అపోలో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఈటలను ఇప్పటికే పలువురు నేతలు పరామర్శించగా.. ఈ రోజు(ఆదివారం) బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రాఘునందర్‌రావు పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈటల రాజేందర్ ఆరోగ్యం మెరుగైందని.. ఆయన రేపు డిశ్చార్జ్ అవుతారని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. ఈటల మళ్ళీ పాదయాత్ర కొనసాగిస్తారని ఆయన అన్నారు. ప్రజలను కలిసేందుకు ప్రజాక్షేత్రంలోకి మళ్లీ వెళ్తారని రాజాసింగ్ తెలిపారు. హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఈటల ఇప్పటికే ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. మరోసారి కూడ ఈటలను ప్రజలు ఆశీర్వదించబోతున్నారని ఆయన అన్నారు. హుజూరాబాద్‌లో ఈటల గెలుస్తున్నార‌ని రాజాసింగ్ జోష్యం చెప్పారు.

Next Story
Share it