Big Breaking: తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం
పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు పరుగులు తీశారు.
By అంజి
Big Breaking: తెలంగాణలోని పలు జిల్లాల్లో స్వల్ప భూకంపం
తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అత్యధికంగా ములుగులో రిక్టర్ స్కేల్‌పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. తొలసారి ఇలాంటి పరిస్థితి ఎదురైందని, కాళ్లు వైబ్రేట్ అవ్వడం గమనించామని ప్రజలు చెబుతున్నారు.
హైదరాబాద్, హన్మకొండ, ఖమ్మం, కొత్తగూడెం, మణుగూరు, గోదావరిఖని, భూపాలపల్లి, చర్ల, చింతకాని, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, నందిగామ, విశాఖ - అక్కయ్యపాలెం, తిరువూరు, గంపలగూడెం పరిసర గ్రామాల్లో పలు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
పెద్దపల్లి జిల్లాలో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో భూప్రకంపనలు రావడంతో ప్రజలు పరుగులు తీశారు. ఐదు సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇంట్లో ఉన్న వారు భూకంప అనుభూతిని పొందరు. సామాన్లు బీరువాలు, బిల్డింగులు ఐదు సెకండ్ల పాటు ఊగాయి. భూప్రకంపనలతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కొద్ది సెకన్ల పాటు స్వల్ప భూకంపం వచ్చింది.
జనగామలో స్వల్ప భూకంపం రావడంతో ఒక్కసారిగా స్థానికులు రోడ్లపైకి వచ్చారు. పెద్దపెల్లి జిల్లా మంథని, కమాన్‌పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో భూప్రకంపనలు వచ్చాయి. రెండు సెకండ్ల పాటు భూమి కంపించింది. వరంగల్ నగరంలో కూడా భూమి కంపించింది. అయితే భూమి స్వల్పంగా కంపించడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని, ఆస్తి నష్టం జరగలేదని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.