హైదరాబాద్: జనవరి నుంచి రాష్ట్రంలో సన్న బియ్యం పథకం ప్రారంభం అవుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. కార్పొరేషన్ నుంచి ఎమ్మెస్పీ, ఆర్థికశాఖ నుంచి బోనస్ చెల్లించేలా ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటానికి నెలల తరబడి సమయం పట్టేదని, ఇప్పుడు మూడు, నాలుగు రోజుల్లో ఖాతాల్లో జమచేసేలా ఏర్పాట్లుచేశామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
రాష్ట్రంలో 80 నుంచి 85 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం ఉత్పత్తి అవుతోందన్నారు. అందులో 36 లక్షల టన్నులు పీడీఎస్‌కు వచ్చినా సరిపోతుందన్నారు. ఈమేరకు ధాన్యం సెంటర్లకు వస్తుందన్న నమ్మకం ఉందని మంత్రి చెప్పారు. దీనిని మిల్లింగ్‌చేస్తే 24 లక్షల టన్నుల సన్న బియ్యం వస్తాయని, నెలకు 2 లక్షల టన్నుల సన్నబియ్యం పేదలకు పంపిణీ చేస్తామని తెలిపారు. జనవరి నుంచి రాష్ట్రంలో సన్నబియ్యం పథకం ప్రారంభం అవుతుందని హామీ ఇచ్చారు.