హైదరాబాద్: సంక్రాంతి నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. కార్డులపై కేబినెట్ సబ్ కమిటీ వేశామని వెల్లడించారు. దాదాపు 36 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు ఆయన చెప్పారు. అటు రేషన్ కార్డుదారులకు ఇప్పుడిచ్చే 6 కిలోలతో పాటు సన్నబియ్యం కూడా ఇస్తామన్నారు. కొత్త 'స్మార్ట్ రేషన్ కార్డులు' సంక్రాంతి తర్వాత అర్హులైన ప్రజలకు జారీ చేయబడతాయని తెలిపారు. రాష్ట్రంలో కుల గణన సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందని మంత్రి తెలిపారు.