రేషన్‌ కార్డుల రద్దుపై మంత్రి క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌ కార్డులు రద్దు చేసినట్లు వస్తున్న వార్తలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు.

By అంజి  Published on  5 Jan 2024 1:06 AM
Minister Uttam, ration cards, Telangana

రేషన్‌ కార్డుల రద్దుపై మంత్రి క్లారిటీ

తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌ కార్డులు రద్దు చేసినట్లు వస్తున్న వార్తలపై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. ''రేషన్‌ కార్డుల రద్దు వార్త అబద్ధం. ప్రభుత్వం రాష్ట్రంలో ఎక్కడా ఒక్క రేషన్‌ కార్డును రద్దు చేయలేదు'' అని ట్వీట్‌ చేశారు.

''మేడ్చల్ జిల్లాలో మొత్తంగా 95,040 తెల్ల రేషన్ కార్డులు రద్దు కాగా.. బాచుపల్లి మండలం - 2,378, ఘట్ కేసర్ - 2,273, కాప్రా - 2,263, కీసర - 3388, మేడ్చల్ - 2,306, మేడిపల్లి - 4,165, శామీర్పేట - 893, మూడుచింతలపల్లి - 3,208 రేషన్ కార్డులు రద్దయ్యాయి. ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 39,270, బాలానగర్ మున్సిపల్ సర్కిల్ పరిధిలో 35,210 కార్డులు రద్దయ్యాయి. మిగతా జిల్లాల్లో సైతం ఇదే స్థాయిలో రేషన్ కార్డులు రద్దయ్యే అవకాశంతో ఆందోళనలో ప్రజలు ఉన్నారు'' అని ఓ వార్త సోషల్‌ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతోంది.

ఈ వైరల్‌ అవుతున్న వార్తను ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్‌ మంత్రి ఉత్తమ్‌ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. రేషన్ కార్డులు రద్దు వార్త అవాస్తవం అంటూ వివరణ ఇచ్చారు.

మరోవైపు ప్రజాపాలన అభయహస్తం పథకాలకు దరఖాస్తుల స్వీకరణ రేపటితో(జనవరి 6) ముగుస్తుంది. ఎవరైనా దరఖాస్తు చేయని నేపథ్యంలో వారంతా స్థానికంగా మండల కేంద్రాల్లోని ఎంపీడీవో, తహసీల్‌ కార్యాలయాల్లోనూ ఫారాలను అందివ్వొచ్చు. ప్రభుత్వం సైతం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ఈ ప్రక్రియను చేపడుతున్నట్లుగా ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రజలెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Next Story