Telangana: కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌!

పంచాయతీ రాజ్‌, గ్రామీణ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు.

By అంజి  Published on  4 Nov 2024 9:00 AM IST
Minister Sithakka, contract employees, outsourcing employees, Telangana

Telangana: కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌!

హైదరాబాద్‌: పంచాయతీ రాజ్‌, గ్రామీణ శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు రెగ్యులర్‌ జీతాలు ఇవ్వాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఈ శాఖల్లోని కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను మంత్రి సీతక్క ఆదేశించారు. ఆన్‌లైన్‌లో ఏకకాలంలో జీతాల చెల్లింపు జరిగేలా కొత్త విధానాన్ని తీసుకురానున్నట్టు సమాచారం.

పంజాయతీ రాజ్‌, గ్రామీణ శాఖల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉద్యోగులు, సిబ్బంది పనిచేస్తున్నారు. వారికి వేతనాల రూపంలో ఎంత చెల్లిస్తున్నారనే వివరాలు సేకరించాలని మంత్రి సూచించారు. వారికి నెలనెలా జీతాలు అందేలా నూతన విధానం తీసుకురావాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

దీంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే వీరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫైల్‌ ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభిస్తే ఉద్యోగులు, సిబ్బందికి నెలనెలా వేతనాలు అందనున్నాయి.

Next Story