మేడారం వెళ్లే మహిళా భక్తులకు RTC బస్సుల్లో ఫ్రీ జర్నీ: మంత్రి సీతక్క
వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు ఎంతో మంది భక్తులు వస్తారని మంత్రి సీతక్క అన్నారు.
By Srikanth Gundamalla Published on 18 Jan 2024 1:15 PM ISTమేడారం వెళ్లే మహిళా భక్తులకు RTC బస్సుల్లో ఫ్రీ జర్నీ: మంత్రి సీతక్క
తెలంగాణలో అత్యంత పేరున్న జాతరలో ఒకటి మేడారంలో జరిగే సమ్మక్క, సారాలమ్మ జాతర. ఈ వేడుకకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజలు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుంటారు. రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడం కోసం ప్రభుత్వంఅన్ని చర్యలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని మంత్రి సీతక్క తెలిపారు.
వివిధ ప్రాంతాల నుంచి మేడారం జాతరకు ఎంతో మంది భక్తులు వస్తారని మంత్రి సీతక్క అన్నారు. అయితే.. మేడారం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం ఉంటుందని చెప్పారు. ఇక మేడారం జాతరను దృష్టిలో పెట్టుకుని పెద్ద ఎత్తున భక్తులు తరలిచే వచ్చే అవకాశం ఉన్నందున బస్సుల సంఖ్యను మరింత పెంచుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే తెలంగాణలోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జీరో టికెట్ ద్వారా మహిళలు ఫ్రీ జర్నీ చేస్తున్నారు. అయితే.. జాతర సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది.. ఈ ఫ్రీబస్ జర్నీ సర్వీసు ఉంటుందో లేదో అని సందేహం నెలకొంది. కొద్దిరోజులుగా దీనిపై చర్చ జరిగింది. ఈ క్రమంలోనే స్పందించిన మంత్రి సీతక్క క్లారిటీ ఇచ్చారు. మేడారం జాతరకు మహిళలకు బస్సుల్లో ఉచితంగా ప్రయాణంచే అవకాశం కల్పించారు. అంతకుముందు మేడారం జాతరకు జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి సీతక్క పరిశీలించారు.