టీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావాలని మంత్రి సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనంత కాలం పాదరక్షలు లేకుండా నడుస్తానని మంత్రి శపథం చేశారు. గత నెలలో సీఎం కేసీఆర్ హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సభలో గిరిజనులకు రిజర్వేషన్లను పది శాతానికి పెంచుతూ జీవో ఇస్తానని ప్రకటించారు. ఆ సమయంలోనే సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్‌కు పాదాభివందనం చేసారు. గిరిజనులకు 10% రిజర్వేషన్ ప్రకటన వెలువడిన వేదికపై ఆమె చెప్పులు ధరించడం మానేసినట్లు తెలుస్తోంది.
గిరిజన బిడ్డగా, గిరిజనుల పక్షాన మంత్రి సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కాళ్లకు చెప్పులు తిరిగి పెట్టుకోనని సత్యవతి రాథోడ్ ప్రకటించారు. కేసీఆర్‌ను గౌరవించి, అభిమానించేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. గిరిజన మహిళను సీఎం కేసీఆర్ ఎలా నమ్మి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించారో ఆమె వెల్లడించారు. ఈ నిర్ణయం పూర్తిగా తనదేనని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. కాగా ఇప్పుడు తెలంగాణలో మంత్రి సత్యవతి రాథోడ్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది.