భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ ప్రభుత్వ కమ్యూనిటీ సెంటర్‌లో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేశ్ పాటిల్ భార్య శ్రద్ధ పాటిల్ మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కలెక్టర్ దంపతులను ఎక్స్ వేదికగా అభినందించారు.
ప్రభుత్వ సౌకర్యంలో ప్రసూతి సేవలను పొందడంలో కలెక్టర్ ఆదర్శంగా నిలిచారని మంత్రి ప్రశంసించారు. ఆసుపత్రి సిబ్బంది అంకితభావం సేవలను ప్రశంసించారు. ప్రజా ప్రతినిధుల ఇటువంటి చర్యలు మన ప్రజారోగ్య వ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తాయి. దానిని లోపల నుండి బలోపేతం చేయడానికి నిబద్ధతను హైలైట్ చేస్తాయి. ఈ సందర్భంగా కొత్తగూడెం వైద్యారోగ్య శాఖ అధికారులు, పాల్వంచ సీహెచ్‌సీ డాక్టర్లు, సిబ్బందికి మంత్రి రాజనర్సింహ అభినందనలు తెలిపారు.