సీఎం కేసీఆర్‌ను క‌లిసిన మంత్రి పువ్వాడ‌

Minister Puvvada meets CM KCR. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్‌లో

By Medi Samrat
Published on : 19 April 2022 8:30 PM IST

సీఎం కేసీఆర్‌ను క‌లిసిన మంత్రి పువ్వాడ‌

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కుటుంబసభ్యులతో కలిసి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. ఈ సంద‌ర్భంగా మంత్రిని సీఎం కేసీఆర్ సత్కరించి.. జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామికి 1కేజీ బంగారం, పట్టువస్త్రాలు అందించినందుకు మంత్రి పువ్వాడ‌ను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి, ఆయన కుమారుడు నయన్‌రాజ్‌ పాల్గొన్నారు.

మంగళవారం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మంత్రి పువ్వాడ‌ దర్శించుకున్నారు. మంత్రి తన జన్మదినాన్ని పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలోని విమాన గోపురానికి.. ఖమ్మం ప్రజలు, రాష్ట్ర ప్రభుత్వం తరపున 1కేజీ బంగారం, పట్టువస్త్రాలను కలెక్టర్‌ పమేలా సత్పతి సమక్షంలో మంత్రి అజయ్‌కుమార్‌.. ఈఓ గీతకు అందజేశారు. మొద‌ట‌ శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం కోసం వ‌చ్చిన‌ మంత్రి, కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు ఆహ్వానించారు.










Next Story