చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన తెలంగాణ మంత్రి
Minister Puvvada Ajay and his son Nayan meets actor JR NTR.తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. యంగ్ టైగర్
By తోట వంశీ కుమార్ Published on 5 July 2021 3:04 PM ISTతెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ని కలిసారు. తన కుమారుడు పువ్వాడ నయన్ రాజ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. నయన్ జూనియర్ ఎన్టీఆర్ కు పెద్ద అభిమాని. అందుకే కొడుకు బర్త్ డే సందర్భంగా అతడిని జూనియర్ వద్దకు మంత్రి పువ్వాడ అజయ్ తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ దర్శకుడు కొరటాల శివ కూడా ఉన్నారు.
నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా @tarak9999 గారిని మర్యాదపూర్వకంగా కలవడమైంది. @Koratala_Fans pic.twitter.com/k5bCPmkhqF
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021
మెగాస్టార్ చిరంజీవిని కూడా పువ్వాడ అజయ్ కుమార్ కలిశారు. దానికి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. మంత్రి పువ్వాడ సినీ ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవిలను కలవడం ఆసక్తికరంగా మారింది. నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై చర్చ జరుగుతోంది. పువ్వాడ నయన్ ను సినిమాల్లోకి తీసుకొస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవికి నయన్ అభిమాని అయి ఉండొచ్చని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
నా తనయుడు Dr.పువ్వాడ నయన్ పుట్టినరోజు సందర్బంగా ప్రముఖ నటుడు, మెగాస్టార్ @KChiruTweets గారిని మర్యాదపూర్వకంగా కలిసి కలవడమైంది. @Koratala_fans pic.twitter.com/udJhDfg5zO
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021
మరోవైపు.. కేటీఆర్‌ను కూడా పువ్వాడ అజయ్ కుమార్, నయన్ కలిశారు. 'నేడు నా తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది' అని పువ్వాడ అజయ్ కుమార్ ట్వీట్ చేశారు.
నేడు నా తనయుడు Dr. పువ్వాడ నయన్ రాజ్ పుట్టిన రోజు సందర్భంగా రామన్న కుటుంబాన్ని మర్యాపూర్వకంగా కలిసి వారి ఆశీర్వాదం తీసుకోవడమైంది. @TelanganaCMO @MinisterKTR @KTRTRS @trspartyonline pic.twitter.com/GfkdLcBNbt
— Ajay Kumar Puvvada (@puvvada_ajay) July 5, 2021