ఈటల, రేవంత్‌రెడ్డి భేటీ ఫొటోలు చూపించాలా?: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో బీజేపీ ఎమ్మెల్యే ఈటల సమావేశం అయ్యారు.
By Srikanth Gundamalla Published on 3 July 2023 1:53 PM ISTఈటల, రేవంత్‌రెడ్డి భేటీ ఫొటోలు చూపించాలా?: మంత్రి ప్రశాంత్‌రెడ్డి
ఖమ్మంలో జరిగిన సమావేశంలో రాహుల్‌గాంధీ బీఆర్ఎస్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటే అని చెప్పారు. బీజేపీకి.. బీఆర్ఎస్ బీ టీమ్‌గా ఉంటోందని చెప్పారు. దీంతో... బీఆర్ఎస్ నాయకులు రాహుల్ గాంధీ కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా రాహుల్‌గాంధీ కామెంట్స్‌పై మాట్లాడారు తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి. రాహుల్‌గాంధీని చాలా మంది పప్పు అని పిలుస్తారు.. అందుకు తగిన వ్యక్తి కాబట్టే అలా అంటారని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలే.. ఏ టీమ్, బీ టీమ్‌లు అని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రహస్య మంతనాలు జరిపారని అన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు తమ దగ్గర ఉన్నాయని.. బయట పెట్టమంటారా అని అన్నారు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.
కాగా.. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక బీజేపీలో చేరారు ఈటల. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈటల గెలుపుతో బీజేపీకి కొత్త ఉత్సాహం వచ్చిందనే చెప్పాలి. కానీ.. పార్టీ అధిష్టానంపై మాత్రం ఈటల అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. సాధారణంగా జాతీయ పార్టీల్లో ముందు నుంచి ఉన్న నేతలకే ప్రాధాన్యత ఉంటుంది. ఆర్ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్నవారికి ప్రధాన బాధ్యతలు అప్పజెప్తారు. ఈ క్రమంలో ఈటల తెలంగాణ బీజేపీలో మంచి పదవి కోరుకున్నారని.. దానికి పార్టీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వినిపించాయి. త్వరలో పార్టీ మారతారనే వార్తలూ వినిపించాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డితో ఈటల సమావేశం అయ్యారని మంత్రి ప్రశాంత్‌రెడ్డి అనడం సంచలనంగా మారింది.