ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, అలా చేయొద్దు..ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం స్పందన

తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, సమ్మె వద్దు అని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

By Knakam Karthik
Published on : 1 May 2025 7:35 AM IST

Telangana, Minister Ponnam Prabhakar, TGRTC Strike

ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, అలా చేయొద్దు..ఆర్టీసీ సమ్మెపై మంత్రి పొన్నం స్పందన

తెలంగాణ ఆర్టీసీ ఇప్పుడిప్పుడే గాడిన పడుతుంది, సమ్మె వద్దు అని ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్తున్నారన్న వార్తలపై ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏ సమస్య అయినా పరిష్కారం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజాపాలన ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆర్టీసీ కార్మికుల పోరాటంతో తెలంగాణ సాధించబడింది. సమ్మెకు వెళ్లడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఆర్టీసీ శ్రేయస్సు దృష్ట్యా ఇది సమ్మె సమయం కాదు. ఆర్టీసీ సమ్మెపై కార్మికులు పునరాలోచన చేయాలి. ముందుగా ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు. నేరుగా సమ్మె అన్నారు. ఆర్టీసీ సమ్మె వద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా..అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

ఆర్టీసీ కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం, ఆర్టీసీ పరిరక్షణ అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇప్పటివరకు శాఖ మంత్రిగా నన్ను కార్మిక నేతలు కలవలేదన్నారు. నేరుగా లేబర్ కమిషన్‌​ను కలిసి నోటీస్ అందజేశారు. ఉద్యమకారుడిగా నాకు ఆర్టీసీతో ప్రత్యేక అనుబంధం ఉంది. కార్మిక సంఘాల నేతలతో సమాలోచనలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా. పదేళ్లు ఆర్టీసీ ఆగమైంది. మేము అధికారంలోకి వచ్చిన తరవాత అన్ని బకాయిలు విడుదల చేస్తున్నాం. రూ.1562 కోట్ల పీఎఫ్ బకాయిలను రూ.600 కోట్లకు తగ్గించాం. సీసీఎస్ బకాయిలను పూర్తిగా తగ్గించి వేశాం. రిటైర్‌మెంట్ అయిన రోజే బెనిఫిట్స్ అందజేయాలనే కార్యాచరణ చేస్తున్నాం. ఆర్టీసీలోని 40 వేల కుటుంబాలకు బాగుపడాలనే కోరుకునే ప్రభుత్వం మాది...అని మంత్రి పొన్నం పేర్కొన్నారు.

Next Story