మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం

మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

By -  అంజి
Published on : 21 Jan 2026 8:06 AM IST

Minister Ponnam Prabhakar, special buses, Medaram Maha Jatara, Telangana

మేడారం నుంచి నిమిషానికి 4 బస్సులు: మంత్రి పొన్నం

మేడారం నుంచి భక్తులు ఇళ్లకు చేరేందుకు నిమిషానికి 4 బస్సులు ఉండేలా ఏర్పాట్లు చేసినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. జాతరకు ఆర్టీసీ బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రద్దీకి తగ్గట్టు 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నామని తెలిపారు. 50 ఎకరాల్లో ఒకేసారి 1000 బస్సులు నిలిపేలా ఏర్పాటు చేశామన్నారు. బస్సులు మేడారం నుంచి వచ్చేటప్పుడు ఖాళీగా ఉంటాయనే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నామని స్పష్టం చేశారు.

మేడారం జాతర భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్సులు నడపాలి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. అదనపు బస్సులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్టీసీ అధికారులు మేడారం జాతర పూర్తయ్యే వరకు మేడారంలోనే ఉండి ఆపరేషన్స్ నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి జాతర కి వచ్చే భక్తులకు విసృత అవగాహన కలిగించేలా హోర్డింగ్స్ తో పాటు ఇతర మాధ్యమాల ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు.

మేడారం జాతర కి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ సమర్థవంతంగా బస్సుల ఆపరేషన్స్ నిర్వహించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో సెక్రటేరియట్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గత మేడారం జాతర లో 3491 ఆర్టీసీ బస్సులు నడిపించగా 16.82 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఈసారి 20 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ లో ప్రయాణం చేస్తారనే అంచనా తో 4000 బస్సులను నడిపిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

అయితే ప్రధానంగా మేడారం వెళ్ళే రూట్లలో వరంగల్ ,హనుమకొండ , ఖమ్మం,కరీంనగర్ రూట్లలో రద్దీ ఎక్కువగా ఉండనుండడంతో రద్దీగా తగిన విధంగా బస్సులు నడపడానికి అక్కడ అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. మేడారంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్ స్టాప్ లో క్యూలైన్ ల వద్ద ప్రయాణికులు జిల్లాల వారిగా వెళ్ళే బస్సులు డిస్ప్లే అయ్యేలా చూడాలని అక్కడ పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమర్థవంతంగా పని చేయాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. మేడారంలో సంస్కృతి సాంప్రదాయాలకు అద్దంపట్టినట్టు శాశ్వత ఆర్టీసీ సముదాయ భవనాన్ని నిర్మించేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.

జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి జరుగుతున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా మేడారం వచ్చే భక్తులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కలిగించేలా హోర్డింగులు, బస్ స్టేషన్లలో , బస్సులో టీవీ ల ద్వారా ప్రచారాలు నిర్వహించాలని సూచించారు..

Next Story