నా ఒక్క మాట.. దయచేసి వినండి: మంత్రి పొన్నం

రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వాహనదారులకు సూచనలు , జాగ్రత్తలు చెబుతూ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు.

By అంజి
Published on : 10 Oct 2024 5:50 AM

Minister Ponnam Prabhakar, traffic rules, telangana

నా ఒక్క మాట.. దయచేసి వినండి: మంత్రి పొన్నం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా వాహనదారులకు సూచనలు , జాగ్రత్తలు చెబుతూ వీడియో సందేశం ద్వారా విజ్ఞప్తి చేశారు. సగటున దేశ వ్యాప్తంగా సంవత్సరానికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారని, తెలంగాణలో సగటున రోజుకి 20 మంది రోడ్డు ప్రమాదంలో మరణిస్తున్నారని మంత్రి పొన్నం వీడియోలో పేర్కొన్నారు.

చెడుపై మంచి విజయం సాధించిన దానికి గుర్తుగా దసరా పండుగను జరుపుకుంటారని అన్నారు. కుటుంబ సభ్యులు అందరం కలిసి ఈ దసరాకి ఆయుధ పూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దామని మంత్రి సూచించారు. ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, హెల్మెట్ , సీటు బెల్టు పెట్టుకుందామని ప్రతిజ్ఞ చేద్దామని అన్నారు. అలాగే మద్యం తాగి వాహనం నడపరాదు. ఇది ప్రమాదానికి సూచిక అని హెచ్చరించారు.

Next Story