సర్వేలో పాల్గొనండి.. పథకాల్లో కోత ఉండదు: మంత్రి పొన్నం
రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు.
By అంజి Published on 10 Nov 2024 12:45 PM IST
Minister Ponnam Prabhakar, people, Telangana, caste enumeration survey
హైదరాబాద్: రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్‌లో జరుగుతున్న సర్వేను ఆయన పరిశీలించి మాట్లాడారు. ఈ సమాచారం అంతా గోప్యంగా ఉంటుందని, సర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ఎన్యుమరేటర్లకు ఇబ్బంది కలిగించడం సరికాదన్నారు. ఈ సర్వే తర్వాత సంక్షేమ పథకాల్లో కోత ఉండదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు.
''చారిత్రాత్మక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే నిన్న ప్రారంభమైంది. ఎన్యుమరెటర్స్ కు ప్రజలు స్వచ్చందంగా సమాచారాన్ని అందిస్తున్నారు. నిన్న గవర్నర్ కూడా కుటుంబ సర్వే లో వివరాలు నమోదు చేసుకున్నారు. ప్రజా ప్రతినిధులు ఇంటింటి కుటుంబ సర్వేలో భాగస్వాములు కావాలి. 150 ఇళ్లకు ఒక ఎన్యుమరెటర్ చొప్పున 85 వేల మంది సిబ్బంది ఇంటింటి కుటుంబ సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా, మండల స్థాయిలో సమీక్ష చేస్తూ సమాచార సేకరణ కు ఇళ్లలోకి వెళ్తున్నారు'' అని మంత్రి పొన్నం తెలిపారు.
''తెలంగాణ వ్యాప్తంగా అన్ని కుల సంఘాల నాయకులను విజ్ఞప్తి చేస్తున్నా.. సమాచార సేకరణకు మీ కుల బలం ఎంతో తెలిస్తే ..మీ కుల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక చేయడానికి ప్రభుత్వం కి అవకాశం ఉంటుంది.. ఎవరికెంతో వారికంత అనే ఆలోచన తో వాటి తేడాలు సరిచేయడానికి ఉపయోగపడుతుంది.. మనిషికి ఏదైనా ఇబ్బంది వస్తే బాడీ ఎక్స్ రే చేసిన మాదిరి కుల గణన సర్వే ఉపయోగపడుతుంది. ఎవరికి ఏ ఇబ్బందీ రాకుండా చూసుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంది. జీవో నెంబర్ 10 ద్వారా ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వం ఉద్యోగులు విధి నిర్వహణలో ఇంటింటి కుటుంబ సర్వే కి మీ ఇంటికి వస్తున్నారు'' అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.